‘డాక్టర్లు రాయకుంటే హెచ్‌సీక్యూ, అజిత్రోమైసిన్ వాడొద్దు’

by vinod kumar |   ( Updated:2020-04-15 12:35:54.0  )
‘డాక్టర్లు రాయకుంటే హెచ్‌సీక్యూ, అజిత్రోమైసిన్ వాడొద్దు’
X

న్యూఢిల్లీ : కరోనా కాలంలో అత్యంత చర్చకు వచ్చిన మాత్రలు హైడ్రాక్సీ క్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) ట్యాబ్లెట్లు, అజిత్రోమైసిన్ మెడిసిన్‌లను డాక్టర్లు సూచిస్తేనే ఉపయోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ఔషధాలను వినియోగించరాదని సూచించింది. అయితే, మెడిసిన్ స్టాక్ విషయంలో భయాందోళనలు అవసరం లేదని పేర్కొంటూనే.. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మాత్రలు తీసుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలబారిన పడే అవకాశముంటుందని తెలిపింది. సాధారణ ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ సూచనలని, వీటిని పాటిస్తే.. సొంత నిర్ణయాలతో మెడిసిన్ తీసుకోవడంతోపాటు, మెడిసిన్ స్టాక్ కోసం ఆందోళనలనూ అరికట్టవచ్చునని వివరించింది. అందుకే ప్రజల్లో ఈ విషయమై అవగాహన కల్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు.. రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, ఐసీఎంఆర్ సెక్రెటరీలు, ఫార్మాస్యూటికల్ డిపార్ట్‌మెంట్, డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు రాశారు. మనదేశంలో అవసరానికి సరిపడేదానికన్నా ఎక్కువ మొత్తంలో హెచ్‌సీక్యూ నిల్వలున్నాయని ఆ లేఖ పేర్కొంది. గుజరాత్ సహా పలుచోట్ల డాక్టర్ల సూచనల్లేకున్నా.. సొంత నిర్ణయాల మేరకు హెచ్‌సీక్యూ మాత్రలు కొన్న ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తాజా సూచనలు చేసింది.

Tags: hcq, inform, people, self prescription, modi govt, azithromycin, prevent, medicines

Advertisement

Next Story

Most Viewed