- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో పెట్రోల్ కష్టాలు అందుకే : నితిన్ గడ్కరీ
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఇంధన చార్జీల పెరుగుదల, పెట్రోలియం ఉత్పతులపై సుంకాల పెంపునకు సంబంధించి కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. దేశంలో పేద, మధ్యతరగతి ప్రజలు పెట్రోల్ చార్జీల పెరుగుదల వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయగా.. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంపు వలన సమకూరిన ఆదాయాన్ని ‘‘మౌలిక సదుపాయాల కోసం అవసరమయ్యే వనరులను ఉత్పత్తి చేయడానికి కేటాయిస్తున్నట్లు’’ తెలిపారు.
రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు భారతదేశంలో రవాణా ఖర్చులను ఎలా ప్రభావితం చేస్తాయని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు గడ్కరీ పై విధంగా బదులిచ్చారు. ఇదిలాఉండగా, ఈ ఏడాదిలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంఖం ద్వారా వసూళ్లు 88 శాతం పెరిగి రూ.3.35 లక్షల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తర్వాత రూ.85 ఉన్న లీటర్ పెట్రోల్ రోజువారీగా పెరిగి ప్రస్తుతం సెంచరీ దాటిన విషయం తెలిసిందే.