రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి : కిషన్‌రెడ్డి

by Shyam |

రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలోని నేషనల్ మెమోరియల్ దగ్గర కిషన్‌రెడ్డి పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మట్లాడుతూ… పుల్వామా దాడికి కారణమైన ఉగ్రమూకలపై బాలకోట్ వైమానిక దాడితో భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని ఆయన తెలిపారు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని రాహుల్ అన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed