- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారామిలిటరీ ఫోర్సెస్‌లో ట్రాన్స్‌జెండర్ల నియామకం?
దిశ, వెబ్‌డెస్క్: ట్రాన్స్‌జెండర్లను పారామిలిటరీ దళాల్లో నియమించాలన్న ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలిపాలని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)ను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం కోరింది. జూలై 1న సీఆర్‌పీఎఫ్(సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్), ఐటీబీపీ (ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్), ఎస్ఎస్‌బీ (సశస్త్ర సీమా బల్), సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)లకు హోంశాఖ ఓ లేఖ రాసింది. సీఏఫీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామినేషన్, 2020 రూల్స్‌లో స్త్రీ, పురుషులతో పాటు ట్రాన్స్‌జెండర్‌ను చేర్చే అంశంపై మీ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. ఒకవేళ నియామకం జరిగితే ఎదురయ్యే పర్యవసానాలపై కూడా పరిశీలన జరిపి అభిప్రాయాలను జూలై 2 ఉదయం 9 గంటల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. మీరందించే అభిప్రాయాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నట్టు వివరించింది.
అయితే, ఇప్పటివరకు సెంట్రల్ పారామిలిటరీ దళాలు, భారత సైన్యంలో ట్రాన్స్‌జెండర్ల నియామకంపై ఎటువంటి నిబంధన విధించలేదు.దీంతో హోంశాఖ పంపిన లేఖ పై వ్యక్తమయ్యే అభిప్రాయాల అధారంగా కేంద్రం ఎటుంటి నిర్ణయం తీసుకోనుందో వేచిచూడాలి.