- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా వైరస్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని, 10లక్షల మందిలో 657 కేసులు నమోదువుతున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 5.7లక్షల మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ఓఎస్డీ రాజేశ్ భూషణ్ ప్రకటించారు. దేశంలో 86శాతం కరోనా వైరస్ కేసులు 10 రాష్ట్రాల్లోనే వస్తున్నాయని అందులో 50శాతం మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలవేనని పేర్కొన్నారు. మిగత 36శాతం కేసులు 8 రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. మూడు నెలల్లో 101 నుంచి 1,206 వరకు ల్యాబ్‌లు పెరిగాయని తెలిపారు. యూపీ, ఒడిశా, తమిళనాడు, అసోంలో ఎక్కువ కేసులు వస్తున్నాయని, అన్ని రాష్ట్రాలు కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని ఆయన సూచించారు.
Advertisement
Next Story