రాష్ట్రాలను ఆదుకోవాలి

by Shyam |
రాష్ట్రాలను ఆదుకోవాలి
X

దిశ, ముషీరాబాద్:
కేంద్రం బాధ్యతగా వ్యవహరించి రాష్ట్రాలను ఆదుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంబర్ పేట నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్ శాంతినగర్‌లో వరద ముంపునకు గురై నష్టపోయిన బాధితులకు పదివేల నగదు సహాయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి మంత్రి తలసాని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యతగగా వ్యవహరించి ఆదుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కోసం హామీలు గుప్పిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఉందని తెలియదా అని ప్రశ్నించారు.

Next Story

Most Viewed