సీతమ్మ సాగర్‌కు 69ఎకరాల అటవీ భూమి

by Shyam |
సీతమ్మ సాగర్‌కు 69ఎకరాల అటవీ భూమి
X

దిశ, న్యూస్‌బ్యూరో: గోదావరి నదిపై నిర్మించే మరో ప్రాజెక్టుకు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ భూమిని బదిలీ చేసింది. ఈ మేరకు సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణానికి 27.9 హెక్టార్లు (68.9 ఎకరాలు) అటవీ భూమిని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదుల ప్రాజెక్టుకు నిరంతరం నీటి సరఫరాకు గోదావరి నదిపై సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం ములుగు, ఏటూరునాగారం, వెంకటాపురం అటవీ డివిజన్ల పరిధిలో భూమి అవసరం పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అటవీ భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేయగా కేంద్రం అనుమతులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed