- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రజనీ పొలిటికల్ ఎంట్రీపై యువ హీరో సినిమా.. తప్పని సెన్సార్ చిక్కులు
దిశ, సినిమా : సూపర్‌స్టార్ రజనీకాంత్ తన హెల్త్ కండిషన్స్ వల్లే పొలిటికల్ ఎంట్రీ ఆలోచనలను విరమించుకోగా.. ఈ విషయంలో తలైవా అభిమానులు నిరాశకు గురైన సంగతి తెలిసిందే. కాగా రజనీ రాజకీయ ప్రవేశంపై తమిళ యువ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ లేటెస్ట్ మూవీ ‘అడంగాదే’లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ తరహా సీన్లు, డైలాగ్స్ పట్ల సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ముత్తుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సర్టిఫికేషన్ కోసం సెన్సార్‌కు వెళ్లింది. ఈ క్రమంలో రజనీ రాజకీయ ప్రస్థానంపై పలు విమర్శలు ఉన్నాయని గుర్తించిన సెన్సార్ సభ్యులు.. మూవీకి క్లియరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ తర్వాత సెన్సార్ బృందం సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించగా.. కమిటీ సూచనల మేరకు మొత్తం 100 సన్నివేశాలను కట్ చేస్తూ, సినిమా విడుదలకు బోర్డు అంగీకరించింది.