- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైనాకు సూర్య, దుల్కర్ మద్దతు
దిశ, వెబ్ డెస్క్: తన మేనత్త కుటుంబ సభ్యులపై జరిగిన దాడి చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు సురేష్ రైనా. పంజాబ్ చాలా భయంకరంగా మారిందన్నారు. మామయ్యను కొట్టి చంపేశారని.. అత్తమ్మ, ఇద్దరు కజిన్స్‌పై ఘోరమైన దాడి జరిగిందన్నారు. దురదృష్టవశాత్తు ఒక కజిన్ కూడా రాత్రి చనిపోయాడని.. అత్త పరిస్థితి విషమంగా ఉందని వాపోయాడు. ఇంత నేరం జరిగితే కనీసం ఏమైందో కూడా తెలుసుకునే అర్హత మాకు లేదా? అని పంజాబ్ పోలీస్ శాఖను ప్రశ్నించాడు. ఇలాంటి క్రిమినల్స్ మరిన్ని క్రైమ్స్ చేయకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
కాగా రైనాకు సపోర్ట్‌గా నిలిచారు హీరో సూర్య, దుల్కర్ సల్మాన్, రణ్‌దీప్ హుడా. ఘటనపై ప్రగాఢ సంతాపం తెలిపిన సూర్య.. మీ దుఖాన్ని భరిస్తున్నామని తెలిపారు. మానవత్వంలేని క్రిమినల్స్‌ను శిక్షించాలని డిమాండ్ చేశాడు. పంజాబ్ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఈ విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలన్నారు.
My deepest condolences dear @ImRaina we all shoulder your grief! Let the heartless criminals be summoned to justice!! @CMOPb @capt_amarinder @PunjabPoliceInd My prayers for strength and peace. https://t.co/y3SeQJpMEO
— Suriya Sivakumar (@Suriya_offl) September 1, 2020
‘మీ నష్టానికి క్షమించండి’ అన్న దుల్కర్.. ప్రస్తుతం కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఊహించేందుకే కష్టంగా ఉందన్నారు. ఈ సమయంలో కుటుంబానికి మరింత బలం చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు.
So sorry for your loss bhai ! Cannot imagine what you and the family is going through. Prayers and strength to all of you in these trying times.
— dulquer salmaan (@dulQuer) September 1, 2020