చైనా వక్రబుద్ధి.. బిపిన్ రావత్ మృతి, ఆర్మీపై సంచలన కామెంట్స్

by Anukaran |
చైనా వక్రబుద్ధి.. బిపిన్ రావత్ మృతి, ఆర్మీపై సంచలన కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ యుద్ధ వీరుణ్ని కోల్పోయామని భారత ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోతుంటే.. చైనా తన వక్రబుద్ధితో పలు విమర్శలు చేసింది. మానవ తప్పిదం వల్లే హెలికాప్టర్ ప్రమాదానికి గురైందంటూ ఆరోపణలు చేసింది.

వెదర్ కండీషన్ మెరుగయ్యే వరకు వేచి చూడాల్సిందని, అంతేకాకుండా పైలెట్ నైపుణ్యంగా నడిపినా ప్రమాదం జరగకపోయేదని అభిప్రాయపడింది. ఇండియన్ మిలిటరీకి డిసిప్లేన్ లేదని సంచలన కామెంట్స్ చేసింది. ఇంతటితో ఆగకుండా ప్రమాదం ఎదురైనప్పుడు ఎదుర్కొనే పోరాట సన్నద్ధత లేదంటూ అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed