- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీబీఐ చేతుల్లోకి సముద్ర దోసకాయల స్మగ్లింగ్ కేసు
న్యూఢిల్లీ: వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షింపబడుతున్న సముద్ర దోసకాయల (సీ కుకుంబర్)కు సంబంధించిన కేసును ఇకపై సీబీఐ విచారించనుంది. ఇంతకుముందు ఈ కేసును లక్షద్వీప్ అటవీశాఖ విచారించింది. ఈ కేసుకు సంబంధించి జనవరి 10న దాఖలైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. లక్షద్వీప్‌లోని కొన్ని ఫిషింగ్ బోట్లు సీ కుకుంబర్‌లను అక్రమంగా వేటాడి, వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని పోలీస్, మత్స్య, పర్యావరణ, అటవీ శాఖలకు సమాచారమందడంతో జనవరి 11న వీరి బృందం సంయుక్తంగా ఈ ద్వీపాన్ని సందర్శించింది. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులతో సముద్రంలో ఉన్న ఓ ఫిషింగ్ బోటు దగ్గరికెళ్లి తనిఖీలు చేయగా, 172 మృతి చెందిన సీ కుకుంబర్‌లు, 46 జీవించి కుకుంబర్‌లు లభ్యమయ్యాయి. వెంటనే వీటిని స్వాధీనం చేసుకుని ప్రాణాలతో ఉన్న 46కుకుంబర్‌లను సముద్రంలోకి వదిలిపెట్టారు. అనంతరం లక్షద్వీప్‌కు చెందిన ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై పలు కేసులు నమోదు చేశారు. అయితే, విచారణలో ఈ జీవులను వేటాడి చైనాకు అక్రమ రవాణా చేస్తున్నారనన్న విషయం వెలుగుచూడటంతో ఈ కేసును సీబీఐ హ్యాండోవర్ చేసుకుంది. కాగా, సముద్రం అడుగుభాగంలో జీవించే సీ కుకుంబర్ జాతులు అంతరించిపోతుండటంతో వీటిని వన్యప్రాణి సంరక్షణ చట్టం కిందకు తీసుకొచ్చారు. ఈ జీవులు ఔషధ తయారీలో ఎంతగానో ఉపయోగపడుతాయి. అంతేకాకుండా వీటిని చైనా, జపాన్ వంటి దేశాల్లో ఆహారంగా తీసుకుంటారు. కాబట్టి ఆయా దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అలాగే, సముద్ర పర్యావరణాన్ని రక్షించడంలో సీ కుకుంబర్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.
Tags: sea cucumbers, cbi, sea cucumber smuggling, china, japan, lakshadweep,