- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండ్ కంపెనీలో సోదాలపై సీబీఐ ప్రకటన
దిశ, వెబ్ డెస్క్: ఎంపీ రఘురామకృష్ణరాజు ఇండ్-భారత్ కంపెనీపై గురువారం నుండి సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంపై సీబీఐ స్పందించింది. ఇండ్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ లో సోదాలపై సీబీఐ ఓ ప్రకటన చేసింది. బ్యాంకులను మోసం చేసిన వ్యవరంపై కేసు నమోదైనట్లు తెలిపింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసినట్టు పేర్కొంది. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న ఇండ్-భారత్ కంపెనీపై కేసు. రూ.826.17 కోట్లు మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని తెలిపింది. నిధులు దారి మళ్లించి దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగాలు వచ్చినట్టు వెల్లడించింది.
కాగా ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా, హైదరాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. కంపెనీ ఆఫీసులు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.