- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాడ్బరీలో అక్రమాలు.. పన్నులు తప్పించుకోవడానికి ప్లాన్.. కేసు నమోదు చేసిన సీబీఐ
దిశ, వెబ్‌డెస్క్: చాక్లెట్ల తయారీలో అగ్రగామిగా ఉన్న క్యాడ్బరీ (Cadbury) సంస్థపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. 2009-10 మధ్య కాలంలో ఆ సంస్థలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) క్యాడ్బరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసింది. ఈ మేరకు హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ముంబయిలలోని ఆ సంస్థ కార్యాలయాలపై సోదాలు చేసింది. పన్నులను తప్పించుకునేందుకు గానూ క్యాడ్బరీ సంస్థ.. కేంద్ర ఆదాయపు పన్ను అధికారులకు లంచాలు ఇవ్వజూపిందని సీబీఐ ఆరోపిస్తున్నది.
ఇందులో భాగంగానే రూ. 241 కోట్లతో హిమాచల్‌ప్రదేశ్ లోని బడ్డీ ప్రాంతంలో కొత్త ప్లాంట్‌ను నెలకొల్పారని ఆరోపణలున్నాయి. ఈ యూనిట్‌లో 5 స్టార్, జెమ్స్, చాక్లెట్స్ ను తయారుచేస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణలో అక్రమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. ఈ ఆరోపణలపై మోండెలెజ్ ఫూడ్స్ (క్యాడ్బరీ ఫుడ్స్ కొత్త పేరు) ఇంకా స్పందించలేదు.