సినీ నటుడు నాగబాబుపై కేసు నమోదు

by Shyam |   ( Updated:2020-05-20 12:15:31.0  )
సినీ నటుడు నాగబాబుపై కేసు నమోదు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రముఖ సినీ నటుడిపై కేసు నమోదైంది. మహాత్మాగాంధీని అవమానపర్చాడంటూ నాగబాబుపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాగబాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ హత్య చేసిన గాడ్సేకు కోర్టు ఉరిశిక్ష విధించడంతో యావత్ ప్రజానీకం కోర్టు తీర్పును హర్షించారన్నారు. అయితే నాగబాబు మాత్రం గాడ్సే గాంధీని చంపటం కరెక్టా కాదా అని ట్వీట్ చేయడం కోర్టు దిక్కారమేనని అందుకు నాగబాబు శిక్షార్హుడని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలు గాంధీ సిద్దాంతాలను ఆచరిస్తుంటే నాగబాబు లాంటి పార్ట్‌టైమ్ పొలిటీషియన్లు గాంధీని అవమానించే విధంగా దిగజారుడు రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. జాతిపితపై పిచ్చి..పిచ్చి వ్యాఖ్యలు చేసిన నాగబాబును ఎర్రగడ్డ పిచ్చి ఆసుప్రతిలో చేర్చాలన్నారు. రామ్ గోపాల్ వర్మ గాడ్సే సినిమా తీస్తే.. మేము రాంగ్ గోపాల్ కర్మ చేసుడు ఖాయమని హెచ్చరించారు.

Advertisement

Next Story