- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చర్చిలో దంపతుల సూసైడ్.. ఆ ముగ్గురిపై యాక్షన్ ప్లాన్
దిశ, పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాల సీఎస్‌ఐ చర్చిలో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు పరకాల ఎస్‌ఐ ప్రశాంత్ తెలిపారు. తాళ్లపల్లి కేశవస్వామి (58), భార్య సంధ్యారాణి (50)లు పరకాల మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు ఆయన స్పష్టం చేశారు. పూల బాబు, గాడిపెళ్లి వెంకటేశ్వర్లు, వాలు నాయక్‌లు అనే వ్యక్తులు ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌లోని పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కేశవ స్వామికి తెలపగా.. వారి ప్రలోభాలకు గురైన కేశవ స్వామి పలువురు నిరుద్యోగుల నుంచి సుమారు 80 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోందన్నారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో నగదు చెల్లించిన వారు కేశవస్వామి కుటుంబంపై ఒత్తిడి చేయడం జరిగిందన్నారు. దీంతో గత్యంతరం లేని స్థితిలో మానసిక ప్రశాంతత కోసం గురువారం పరకాల సీఎస్ఐ చర్చికి వచ్చారని చెప్పారు. ఈ క్రమంలోనే దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డారన్నారు. వీరిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు స్పష్టం చేశారు. పూల బాబు, గాడి పెళ్లి వెంకటేశ్వర్లు, వాలు నాయక్‌లపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ ప్రశాంత్ చెప్పుకొచ్చారు.