- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రేమ పేరుతో మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు
by Sumithra |

X
దిశ, ఖైరతాబాద్: ప్రేమిస్తున్నానంటూ నమ్మించి ఓ యువతిని మోసగించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన రామకృష్ణ నగరంలోని రహమత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. నల్లకుంటలో నివాసముండే ఓ యువతి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ చిన్నచిన్న వేషాలు వేస్తుంది. ఈ క్రమంలో రామకృష్ణతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. త్వరలోనే వివాహం చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకున్న అనంతరం వివాహానికి నిరాకరించాడని బాధిత యువతి ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రామకృష్ణపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story