- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
67,557 మందిపై కేసు.. అందరు చేసింది ఒకటే నేరం
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ నివారణకు ప్రభుత్వాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. మరోవైపు నాయకులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు వైరస్ నివారణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. భౌతిక దూరం పాటించడంతోపాటు ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, తరుచూ శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని పదే, పదే సూచిస్తున్నాయి. మాస్క్ తప్పనిసరి చేయడంతోపాటు భౌతిక దూరం కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు. అయినా కొందరు మాట వినడం లేదు. ఒకవైపు ప్రాణాలు పోతున్నా కరోనాను లైట్ తీసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖానికి మాస్క్ లేకుండా ఇంటి నుంచి బయటకు వస్తే రూ.1000 ఫైన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాస్క్ లేకుండా వచ్చి వైరస్ వాహకాలుగా మారొద్దని హెచ్చరించింది. పట్టణాలే కాదు, గ్రామాల్లోనూ మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధించాలని అధికారులతోపాటు సర్పంచ్ లకు ఆదేశాలు జారీ చేసింది. అయినా కొద్దిమంది ప్రజల్లో అలసత్వం కనిపిస్తోంది. తరుచూ మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగుతూ తోటివారికి ప్రమాదకరంగా మారుతున్నారు.
మాస్క్ పెట్టుకోకుండా బహిరంగ ప్రాంతాల్లో తిరిగిన 67,557 మందిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. మరో 3,288 మందికి ఈ-చలానాలు వడ్డించారు. ఇలా మాస్క్ లేకుండా తిరిగిన కేసుల్లో హైదరాబాద్ టాప్ లో ఉన్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చివరి స్థానంలో ఉన్నది.
లాక్‌డౌన్ ప్రారంభమైన మార్చి 22 నుంచి జూన్ 30వ వరకు 29 పోలీస్ యూనిట్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో 14,931 మందిపై కేసులు నమోదయ్యాయి. తర్వాతి ప్లేసులో రామగుండం కమిషనరేట్ 8,290, ఖమ్మం 6,372, సూర్యాపేట 4,213, వరంగల్ 3,907, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతమై కోవిడ్ 19 నివారణకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.