- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మధుప్రియ సహా ఏడుగురిపై కేసు
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలోని పెందుర్తిలో దళిత యువకుడి శిరోముండనం ఘటనలో మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందిరా, ఝూన్సీ, సౌజన్య, బాలు, రవి, మధుప్రియ, వరహాలుపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ, పీఓఏ యాక్ట్ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మధుప్రియ సూచన మేరకే శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. కాగా, విశాఖలో ఈ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ శిరోముండనం ఘటనకు వ్యతిరేకంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
Next Story