100 దేశాల్లో సీపీఎల్ ప్రసారం

by Shyam |
100 దేశాల్లో సీపీఎల్ ప్రసారం
X

దిశ, స్పోర్ట్స్: లాక్‌డౌన్ అనంతరం ప్రారంభమైన తొలి క్రికెట్ లీగ్ కరేబియన్ ప్రీమియర్ లీగ్(cpl). మంగళవారం నుంచి మొదలైన ఈ లీగ్‌ను 100 దేశాల్లో ప్రసారం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత టీ20 (T20)లీగ్ జరుగుతుండటంతో ఆయా దేశాల్లోని అభిమానులు తప్పక చూస్తారని సీపీఎల్ (cpl)నిర్వాహకులు భావిస్తున్నారు.

దీంతో వీలైనంత మంది బ్రాడ్‌కాస్టర్ల (Broadcaster)ను రంగంలోకి దింపారు. బ్రాడ్‌కాస్టర్లు దొరకని చోట ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌ (Facebook, Twitter, YouTube)లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. క్రికెట్‌కు ఆదరణ ఉన్న ఇండియా, యూకే, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, సౌత్ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏసియా, బంగ్లాదేశ్, యూఏఈలలో స్టార్ టీవీ, స్కై స్పోర్ట్స్, బీబీసీ, ఫాక్స్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ మ్యాక్ వంటి బ్రాడ్‌కాస్టర్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ఇక మిగిలిన దేశాల్లో ఫేస్‌బుక్, యూట్యూబ్ ద్వారా స్ట్రీమింగ్ (Streaming) చేయనున్నారు.

Advertisement

Next Story