- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC NOTIFICATION: 'జియో సైంటిస్ట్' ఉద్యోగాల భర్తీకి.. 'యూపీఎస్సీ' నోటిఫికేషన్ జారీ!
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర సంస్థల్లో.. జియో సైంటిస్ట్(Gio Scientist) ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ(Union Public Service Commission) నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. ఉద్యోగంలో చేరిన వారికి లెవల్-10 వేతనాలు చెల్లిస్తారు. వీరికి ఉన్నత హోదాతో పాటు మొదటి నెల నుంచే రూ. లక్షకు పైగా జీతం అందుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాన్ని పొందాలంటే.. స్టేజ్-1 ప్రిలిమినరీ, స్టేజ్-2 మెయిన్స్, స్టేజ్-3 ఇంటర్వ్యూ లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
స్టేజ్-I: స్టేజ్-1 లో ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానం(OMR)లో ఉంటుంది. పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఇందులో మొత్తం మార్కులు 400. రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ లో జనరల్ స్టడీస్ కు 100 మార్కులు. ఈ పేపర్ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. పేపర్-2 లో దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి ప్రశ్నాపత్రం ఉంటుంది. దీనికి 300 మార్కులు ఉంటాయి. పేపర్-1, పేపర్-2 ఒక్కో ప్రశ్నా పత్రం వ్యవధి 2 గంటలు ఉంటుంది. 1/3 నెగెటివ్ మార్కింగ్(Negetive marks) ఉంటుంది(తప్పుడు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి మూడో వంతు తగ్గిస్తారు). ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్ల లోనూ అర్హత మార్కులు సాధించిన వారికి మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా స్టేజ్ -2(Mains Exam) కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్టేజ్-II: ఈ పరీక్ష అనేది డిస్క్రిప్టివ్(Discriptive method) తరహాలో ఉంటుంది. పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది కనుక, సమాధానాలు అదే మాధ్యమంలో రాయవలసి ఉంటుంది. మెయిన్స్ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విభాగం నుంచి 3 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు 200 చొప్పున 600 మార్కులకు స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ కు 3 గంటల వ్యవధి ఉంటుంది. స్టేజ్-2 పరీక్ష లో అర్హత సాధించిన వారికి విభాగాల(Subject-wise) వారిగా మొత్తం ఖాళీలకు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను స్టేజ్-3(Interview) కు ఎంపిక చేస్తారు.
స్టేజ్-III: ఇంటర్వ్యూ లో మొత్తం 200 ఉంటాయి. కనీస అర్హత మార్కుల నిబంధన ఏమీలేదు. అభ్యర్థులు సంబంధిత ఉద్యోగానికి తగినవారా లేదా, లీడర్షిప్ క్వాలిటీస్(నాయకత్వ లక్షణాలు), ఇంకా ఇతర సామర్థ్యాలను అంచనా వేసి వారి మార్కులను నిర్ణయిస్తారు. అభ్యర్థులు అన్ని స్టేజ్ లలో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఫైనల్ రిజల్ట్స్(తుది జాబితా) ఉండటం జరుగుతుంది.
మొత్తం పోస్టులు: 85
కేటగిరీ-1 జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పోస్టులు:
- జియాలజిస్ట్-16
- జియోఫిజిసిస్ట్-06
- కెమిస్ట్-02
కేటగిరీ-2 సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో ఉన్న పోస్టులు:
- హైడ్రో జియాలజిస్ట్-13
- కెమికల్-01
- జియో ఫిజిక్స్-01
- అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్-31
- అసిస్టెంట్ కెమిస్ట్- 04
- అసిస్టెంట్ జియో ఫిజిసిస్ట్-11.
అర్హత:
- కెమిస్ట్, కెమికల్ పోస్టులకు.. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/అప్లైడ్ కెమిస్ట్రీ/ అనలైటికల్ కెమిస్ట్రీ చేసిన వారు అర్హులు.
- జియాలజిస్ట్ పోస్టులకు.. పీజీలో జియాలజీ/అప్లైడ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ/ఇంజినీరింగ్ జియాలజీ/ఎర్త్ సైన్స్/ఓషనోగ్రఫీ/జియో కెమిస్ట్రీ చదివి ఉండాలి.
- జియో ఫిజిక్స్, జియో ఫిజిసిస్ట్ పోస్టులకు.. ఎమ్మెస్సీ అప్లైడ్ ఫిజిక్స్/జియో ఫిజిక్స్/ అప్లైడ్ జియో ఫిజిక్స్/ మెరైన్ జియో ఫిజిక్స్ చదివి ఉండాలి.
- హైడ్రో జియాలజీ పోస్టులకు.. పీజీలో జియాలజీ/ హైడ్రో జియాలజీ/అప్లైడ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ చదివిన వారు అర్హులు.
వయసు: జనవరి 01, 2025 తేదీ నాటికి గరిష్ఠ వయసు 32 ఏళ్లకు మించరాదు(ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది).
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24-09-2024.
దరఖాస్తు ఫీజు: రూ. 200 (మహిళలు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది)
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 09-02-2025
మెయిన్స్ పరీక్ష: జూన్ 21&22 తేదీల్లో 2025 లో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలకు ఎగ్జామ్ సెంటర్: హైదరాబాద్.
వెబ్ సైట్: https://upsc. gov.in/