బీఎస్ఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్.. ఇన్ స్పెక్టర్ పోస్టులు..

by Vinod kumar |   ( Updated:2023-02-13 13:25:46.0  )
బీఎస్ఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్.. ఇన్ స్పెక్టర్ పోస్టులు..
X

దిశ, కెరీర్: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. సబ్ ఇన్ స్పెక్టర్, ఇన్ స్పెక్టర్ గ్రూప్ - బి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

1. ఇన్ స్పెక్టర్ (ఆర్కిటెక్ట్) - 1

2. సబ్ ఇన్ స్పెక్టర్ (వర్క్స్)-18

3. జూనియర్ ఇంజనీర్/సబ్ ఇన్ స్పెక్టర్ (ఎలక్ట్రికల్) - 4

మొత్తం ఖాళీలు: 23

అర్హత: డిగ్రీ (ఆర్కిటెక్చర్), డిప్లొమా (సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు ఎస్సై/జేఈఈ రూ. 35,400 నుంచి రూ. 1,12,400 ; ఇన్ స్పెక్టర్‌కు రూ. 44,900- రూ. 1,42,400.

ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 13, 2023.

వెబ్‌కసైట్: https://rectt.bsf.gov.in

Advertisement

Next Story