బీటెక్ నిరుద్యోగులకు శుభవార్త.. BEL లో జాబ్స్, ఏడాదికి రూ.17లక్షల వరకు వేతనం

by Kavitha |   ( Updated:2022-03-30 08:48:02.0  )
బీటెక్ నిరుద్యోగులకు శుభవార్త.. BEL లో జాబ్స్, ఏడాదికి రూ.17లక్షల వరకు వేతనం
X

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 43

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 18

*ఇందులో డిప్యూటీ మేనేజర్ 6, సీనియర్‌ ఇంజనీర్‌ 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


*డిప్యూటీ మేనేజర్ పోస్టులు కంట్రోల్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి బీఈ, బీటెక్ పాసై ఉండాలి. అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2022 ఫిబ్రవరి 1 నాటికి 36 ఏళ్ల వయస్సు మించరాదు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థలకు ఏడాదికి రూ.17,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.


*సీనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు కంట్రోల్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్‌, ఆప్టిక్స్‌ విభాగంలో ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి బీఈ, బీటెక్ పాసై ఉండాలి. అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2022 ఫిబ్రవరి 1 నాటికి 32 ఏళ్ల వయస్సు మించరాదు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థలకు ఏడాదికి రూ.14,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును Manager (HR), Product Development & Innovation Centre (PDIC), Bharat Electronics Limited, Prof. U R Rao Road, Near Nagaland Circle, Jalahalli Post, Bengaluru – 560 013, India చిరునామాకి పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.bel-india.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Advertisement

Next Story

Most Viewed