NITTTR Job Notification: టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ!

by Geesa Chandu |
NITTTR Job Notification: టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ!
X

దిశ, వెబ్ డెస్క్: చెన్నై(Chennai)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(National Institute of Technical Teachers) లో.. గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

గ్రూప్-ఎ పోస్టులు..

మొత్తం పోస్టులు: 04

  • సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: 01
  • టెక్నికల్ ఆఫీసర్: 03

గ్రూప్-బి పోస్టులు..

మొత్తం పోస్టులు: 05

  • సీనియర్ ఆఫీసర్ గ్రేడ్-1/2: 04
  • టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-1: 01

విభాగాలు: అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్, సీనియర్ పీఏ టూ డైరెక్టర్, అకౌంట్స్, కెమెరా మ్యాన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఎడిటర్/ ప్రొడక్షన్ అసిస్టెంట్, సినిమాటోగ్రఫీ ఇంకా ఇతర విభాగాలు.

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, డిగ్రీ, ఎంఈ/ఎంటెక్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.

వయసు: గ్రూప్-ఎ పోస్టులకు 45 ఏళ్లు, గ్రూప్-బి పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.

వేతనం: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ.56,100 - రూ.1,77,500; సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ. 67,000 - రూ.2,08,700; సీనియర్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.44,900-1,42,400; మిగతా పోస్టులకు రూ.35,400- 1,12,400.

ఫీజు: రూ.500.(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలు/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

గ్రూప్-సి పోస్టులు..

మొత్తం పోస్టులు: 22

  • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 06
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 01
  • టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-2: 02
  • సీనియర్ టెక్నీషియన్: 02
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 02
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 08
  • టెక్నీషియన్: 01

విభాగాలు: జూనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్, కన్సోల్ ఆపరేటర్, హిందీ ట్రాన్స్ లేటర్, స్టెనో గ్రాఫర్, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్, స్టివార్డ్, ఐటీ, సీఎస్ఈ ఇంకా ఇతర విభాగాలు.

అర్హత: 10 వ తరగతి, ఇంటర్మీడియట్, పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఫీజు: రూ. 500; మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.300; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలు/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష(Written Test), స్కిల్ టెస్ట్(Skill Test)/ఫిజికల్ టెస్ట్(Physical Test), ఇంటర్వ్యూ(Interview)ల ఆధారంగా ఎంపిక ఉండును.

గ్రూప్ ఎ, బి, సి ఉద్యోగాలకు...

పని ప్రదేశాలు: హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, కలమస్సేరి.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2024.

వెబ్ సైట్: https://www.nitttrc.ac.in/

Advertisement

Next Story

Most Viewed