అకడమిక్ మెరిట్ ఆధారంగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు, త్వరపడండి..

by Kavitha |   ( Updated:2022-03-31 04:56:22.0  )
అకడమిక్ మెరిట్ ఆధారంగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు, త్వరపడండి..
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం పోస్టుల సంఖ్య: 135

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 4

*ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

*జనరల్ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఓబీజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, అనెస్థీషియా విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి విద్యార్హత సంబంధించి ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ లో పాసై ఉంటే సరిపోతుంది.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,25,000 వరకు వేతనం చెల్లిస్తారు.

*సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగానికి విద్యార్హత సంబంధించి ఎంబీబీఎస్ పాస్ తో పాటు తెలంగాణ, ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజస్టరయ్యి ఉండాలి.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.52,000ల వరకు వేతనంగా చెల్లిస్తారు.

*అకడమిక్ మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును The Principal, Osmania Medical College, Hyderabad-500095 చిరునామాకి పంపించాలి.

Advertisement

Next Story

Most Viewed