బీటెక్, ఎంటెక్, ఎంసీఏ అర్హతలతో IDRBT హైదరాబాద్ లో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్ష వరకు వేతనం

by Kavitha |   ( Updated:2022-04-08 02:49:19.0  )
బీటెక్, ఎంటెక్, ఎంసీఏ అర్హతలతో IDRBT హైదరాబాద్ లో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్ష వరకు వేతనం
X

కేంద్ర ప్రభుత్వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన హైదరాబాద్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ టెక్నాలజీ(IDRBT)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్/ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 23

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 25

*ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌, ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజనీర్‌, ప్రాజెక్ట్‌ టెక్నిక్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ఉద్యోగానికి సంబంధించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ పాస్ తో పాటు సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,00000 వేతనం చెల్లిస్తారు.

*సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉద్యోగానికి సంబంధించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ పాస్ తో పాటు సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి. నెలకు రూ.1,00000 వేతనం చెల్లిస్తారు.

*ఫుల్ స్టాక్ డెవలపర్ ఉద్యోగానికి సంబంధించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ పాస్ తో పాటు సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి. నెలకు రూ.1,00000 వేతనం చెల్లిస్తారు.

*టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగానికి సంబంధించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ పాస్ తో పాటు సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి. నెలకు రూ.45000 వేతనం చెల్లిస్తారు.

*ప్రాజెక్ట్ టెక్నిక్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ పాస్ తో పాటు సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి. నెలకు రూ.30000 వేతనం చెల్లిస్తారు.

*ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి ఎంబీఏ పాసై ఉండాలి. అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27000 వేతనం చెల్లిస్తారు.

*సెలక్షన్ ప్రాసెస్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును The Human Resources Department, IDRBT, Castle Hills, Road No.1, Masab Tank, Hyderabad – 57 చిరునామాకి పంపించాలి.

*ఈ మెయిల్‌ ఐడీ: [email protected]

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.idrbt.ac.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.




Advertisement

Next Story

Most Viewed