ఇంటర్వూ ఆధారంగా హైదరాబాద్ ICAR-NAARMలో ఉద్యోగాలు..

by Kavitha |
ఇంటర్వూ ఆధారంగా హైదరాబాద్ ICAR-NAARMలో ఉద్యోగాలు..
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న ICAR- నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్ మెంట్(NAARM)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 12

*వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 2022 ఎప్రిల్ 18, 20, 22

*ఇందులో ఎక్స్‌ఎస్‌ఎం డివిజన్‌, డీటీఎంఏ, ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ సెక్షన్, ఈఎస్‌ఎం విడిజన్‌, జీఐఎస్‌ యాక్టివిటీస్‌, ట్రైనింగ్ యాక్టివిటీస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్‌/ మాస్టర్స్‌, బీకామ్‌/బీబీఏ/బీబీఎస్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ పాసై ఉండాలి.

*సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ చూస్తారు.

*వయోపరిమితికి సంబంధించి 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35000 వేతనం చెల్లిస్తారు.

*ఇంటర్వ్యూ వేదిక:ICAR-NAARM, Rajendranagar, Hyderabad - 500030, Telangana

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://naarm.org.in/home/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Advertisement

Next Story

Most Viewed