నిరుద్యోగులకు శుభవార్త.. ESIC హైదరాబాద్ లో ఉద్యోగాలు, రూ.2లక్షలకు పైగా జీతం త్వరపడండి..

by Kavitha |   ( Updated:2022-03-30 04:16:53.0  )
నిరుద్యోగులకు శుభవార్త.. ESIC హైదరాబాద్ లో ఉద్యోగాలు, రూ.2లక్షలకు పైగా జీతం  త్వరపడండి..
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్, సనత్ నగర్ లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC) మెడికల్ కాలేజ్ లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 311

*దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 2022 ఏప్రిల్ 3

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఎప్రిల్ 17

*ఇందులో ఫ్యాకల్టీ పోస్టులు, సూపర్ స్పెషలిస్టులు, జూనియర్ కన్సల్టెంట్లు, స్పెషాలిటీ స్పెషలిస్టులు, సీనియర్ రెసిడెంట్లు, రిసెర్చ్ సైంటిస్టులు, కన్సల్టెంట్లు, సీనియర్ రెసిడెంట్లు(బ్రాండ్ స్పెషాలిటీ), జూనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు(బ్రాండ్ స్పెషాలిటీ) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా(ఎండీ/ఎంఎస్, పీహెచ్ డీ) పాసై ఉండాలి.

*సంబంధిత విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*ఉద్యోగాన్ని అనుసరించి నెలకు రూ.60000 నుంచి 2,80,250 వేతనం చెల్లిస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం అకడమిక్ మెరిట్, టీచింగ్ ఎక్స్ పీరియన్స్, నీట్ స్కోర్2021 చూస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.esic.nic.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.


Advertisement

Next Story

Most Viewed