బంధన్ బ్యాంక్ లో ఉద్యోగాలు, త్వరపడండి

by Kavitha |   ( Updated:2022-03-04 08:05:42.0  )
బంధన్ బ్యాంక్ లో ఉద్యోగాలు, త్వరపడండి
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రైవేట్ బ్యాంక్ అయిన బంధన్ బ్యాంకులో ఫైనాన్స్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలో అడ్మినిస్ట్రేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 39

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 31

*విద్యార్హతకు సంబంధించి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పాసై ఉండాలి. అభ్యర్థులకు మంచి కమ్యూనికేషన్స్‌తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్‌ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం అకడమిక్ మెరిట్ చూస్తారు. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14,200 నుంచి రూ.20,100 వేతనం చెల్లిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.ncs.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Advertisement

Next Story

Most Viewed