JCI JOB OPENINGS: జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ!

by Geesa Chandu |   ( Updated:2024-09-12 13:51:47.0  )
JCI JOB OPENINGS: జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ!
X

దిశ, వెబ్ డెస్క్: కోల్ కతా(Kolkata) లోని జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Jute Corporation of India limited) లో.. ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఉద్యోగాలు: 90

  • అన్ రిజర్వుడ్ కు కేటాయించిన పోస్టులు: 38
  • ఈడబ్ల్యూఎస్ కు: 08
  • ఓబీసీ(ఎన్ సీఎల్)లకు: 21
  • ఎస్సీలకు: 15
  • ఎస్టీలకు: 08

1. అకౌంటెంట్ పోస్టులు-23:

అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ స్పెషల్ సబ్జెక్ట్(advanced accountancy and special subject) గా ఎంకాం పూర్తి చేసి ఉండాలి. కమర్షియల్ అకౌంట్స్/ నగదు, రికార్డుల నిర్వహణలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. (లేదా) బీకాం పాసై ఏడేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. ఏసీఏ, ఎస్ఏఎస్, సీఏ, ఏసీడబ్ల్యూఏ, సీఏడీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

వేతనం: రూ.28,600-1,15,000.

2. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు-25:

డిగ్రీ/ తత్సమాన పరీక్ష పాసై.. ఎంఎస్-వర్డ్, ఎంఎస్-ఎక్సెల్ పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లీష్ లో నిమిషానికి 40 పదాలు టైప్ చేయగలగాలి.

వేతనం: రూ.21,500-80,000.

3. జూనియర్ ఇన్స్పెక్టర్ పోస్టులు-42:

ఇంటర్మీడియట్/ తత్సమాన పరీక్ష పాసై.. జూట్ అమ్మకాలు/ కొనుగోళ్లు/ గ్రేడింగ్/బెయిలింగ్/స్టోరేజ్/ రవాణాలో మూడేళ్ల అనుభవం ఉండాలి.

వేతనం: రూ.21,500-80,000.

వయసు: 30 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠంగా ఎస్సీ/ఎస్టీ లకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ లకు కేటగిరీని బట్టి 10 నుంచి 15 ఏళ్లు, జేసీఐఎల్ ఉద్యోగులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.250 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ లకు ఫీజు లేదు)

ఎంపిక:

  • అకౌంటెంట్ పోస్టు: ఈ పోస్టుకు.. ఎంపిక రెండు దశలలో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష(Computer Based Test), రెండో దశలో ధ్రువపత్రాల పరిశీలన(Certificate Verification) ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్టును ప్రకటిస్తారు.

సీబీటీ(Computer Based Test) లో సాధించిన మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • జూనియర్ అసిస్టెంట్ పోస్టు: ఈ పోస్టుకు.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఎంపిక ఉంటుంది.

ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి 40 పదాలు ఉండాలి.

  • జూనియర్ ఇన్స్పెక్టర్ పోస్టు: ఈ పోస్టుకు.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT), ధ్రువపత్రాల పరిశీలన, ట్రేడ్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT): ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 120 నిమిషాలు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, నెగెటివ్ మార్కులు లేవు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2024

వెబ్ సైట్: www.jutecorp.in

Advertisement

Next Story

Most Viewed