ITBP POLICE JOBS: సరిహద్దులో సేవలందిస్తారా.. ఇండో-టిబెటన్ లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

by Geesa Chandu |
ITBP POLICE JOBS: సరిహద్దులో సేవలందిస్తారా.. ఇండో-టిబెటన్ లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(Indo-Tibetan Border Police Force) లో.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రూప్-సీ విభాగానికి సంబంధించిన కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) పోస్టులు భర్తీ కానున్నాయి. దీనికి పురుషులతో పాటు మహిళలూ పోటీ పడవచ్చు.

మొత్తం పోస్టులు: 819

పురుషులకు: 697

మహిళలకు: 122

(వీటిలో అన్ రిజర్వుడ్ కు 458, ఓబీసీలకు 162, ఈడబ్ల్యూఎస్ లకు 81, ఎస్సీలకు 48, ఎస్టీలకు 70 పోస్టులు కేటాయించారు)

అర్హత: మెట్రిక్యులేషన్/పదో తరగతి పాసై ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ లో ఎన్ఎస్ క్యూఎఫ్ లెవల్-1 కోర్సును పూర్తి చేయాలి.

వయసు: 01-10-2024 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.(గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీ లకు 5 ఏళ్లు, ఓబీసీ(ఎన్ సీఎల్)లకు 3 ఏళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు 3-8 ఏళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100.(ఎస్సీ/ఎస్టీ/మహిళలకు ఫీజు లేదు)

ఎంపిక: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(Physical Efficiency Test), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(Physical Standard Test), రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 01, 2024.

వెబ్ సైట్: https://recruitment.itbpolice.nic.in

Advertisement

Next Story