- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఈఎంఎల్ లో... 100 కొలువులు
దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) లో ఒప్పంద ప్రాతిపదికన 100 గ్రూప్-సి పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి.
ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలిక్ట్రీషియన్, వెల్డర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వయసు 32 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు గరిష్ట వయసు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది.
పోస్టుల సంఖ్య, అర్హతలు:
- ఐటీఐ ట్రెయినీలు: 54
ఐటీఐలో 60 శాతం మార్కులతో పాసై.. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉండాలి. అప్రెంటిస్ శిక్షణ పూర్తయిన తర్వాత మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
- ఆఫీస్ అసిస్టెంట్ ట్రెయినీలు - 46
డిగ్రీ/ కమర్షియల్ ప్రాక్టీస్ డిప్లొమా/కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సెక్రటేరియల్ ప్రాక్టీస్ డిప్లొమా ఉండాలి. ఆరు నెలల టైపింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం. గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ. 200. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ లకు ఫీజు లేదు.
ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్టులతో..
ఐటీఐ ట్రెయినీలకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష లేదా ట్రేడ్ టెస్ట్ తో ఉద్యోగంలోకి తీసుకుంటారు. రాత పరీక్షను మాత్రం బెంగళూరులోనే నిర్వహిస్తారు.