ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..

by Sumithra |
ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : నిరుద్యోగులకు శుభవార్త. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ DMRCలో ఉద్యోగం పొందాలనుకుంటే, మీకు ఒక సువర్ణావకాశం ఉంది. DMRC సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా ఢిల్లీ మెట్రో అధికారిక వెబ్‌సైట్ delhimetrorail.comకు లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఢిల్లీ మెట్రోలో రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఢిల్లీ మెట్రో ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా సెప్టెంబర్ 17వ తేదీ లోపు లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా, డీఎంఆర్‌సీలో సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

వయోపరిమితి..

DMRC రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయోపరిమితి 55 సంవత్సరాలు కాగా గరిష్ట వయోపరిమితి 62 సంవత్సరాలు.

అర్హత..

ఢిల్లీ మెట్రో రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా రైల్వే/మెట్రో ట్రాక్‌ల నిర్మాణం, లేదా నిర్వహణలో అనుభవం కలిగి ఉండాలి. రైల్వేలు/CPSU/మెట్రో సంస్థల వంటి ఏదైనా ప్రభుత్వ సంస్థలో పనిచేసిన అనుభవం ఉండాలి. ప్రస్తుతం రైల్వే/CPSU/మెట్రోలో రెగ్యులర్ సర్వీస్‌లో ఉన్న అభ్యర్థులు కూడా అర్హులు. వారు DMRCలో చేరడానికి ముందు VRS లేదా సర్వీస్ నుండి రిటైర్మెంట్‌ని ఎంచుకోవాలి.

వేతనం వివరాలు..

ఢిల్లీ మెట్రోలో సెక్షన్ ఇంజనీర్ పోస్టుకు ఎంపికైతే, అభ్యర్థి నెలకు రూ. 59,800 జీతం పొందవచ్చు. అయితే జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైతే, అభ్యర్థి రూ. 45,400 నుంచి రూ. 51,100 మధ్య వేతనం తీసుకోవచ్చు.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ..

DMRC రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అవుతారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను సంబంధిత పత్రాలతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మానవ వనరులు), ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, మెట్రో భవన్, ఫైర్ బ్రిగేడ్ లేన్, బరాఖంబా రోడ్, న్యూఢిల్లీకి పంపాలి. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు ఢిల్లీ మెట్రో delhimetrorail.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

DMRC రిక్రూట్‌మెంట్ 2024 అధికారిక నోటిఫికేషన్

Advertisement

Next Story

Most Viewed