టెన్త్ అర్హతతో CONSTABLE JOBS: 39,481 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

by Kavitha |
టెన్త్ అర్హతతో CONSTABLE JOBS: 39,481 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రక్షణ దళంలో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ (SSC GD Constable) నియామకాల నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. అయితే గతేడాది 46,617 ఖాళీల నియామక ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది 39,481 పోస్టులు భర్తీ కానున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి అక్టోబర్‌ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌ 5, 6, 7 తేదీల్లో ఎడిట్‌ ఆప్షన్‌ అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు.

1) జీతం:

పే లెవెల్‌ -1 కింద ఎన్‌సీబీలో(NCB) సిఫాయి ఉద్యోగాలకు రూ. 18,000 నుంచి 56,900 చొప్పున ఇవ్వనుండగా.. ఇతర పోస్టులకు పే లెవెల్‌ -3 కింద రూ. 21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది.

2) అర్హతలు:

గుర్తింపు పొందిన బోర్టు లేదా యూనివర్శిటీ నంచి టెన్త్‌ లేదా మెట్రిక్యులేసన్ పాసై ఉండాలి. పురుషులు అయితే 170 సెం.మీ.ల(170 CM) ఎత్తు, మహిళలు అయితే 157 సెం.మీ.(157 CM)లకు ఎత్తు తగ్గకుండా ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ(SC), ఎస్టీ(ST) అభ్యర్థులకు ఐదేళ్ళు, ఓబీసీ(OBC) అభ్యర్థులకు మూడేళ్ళ సడలింపు ఉంది.

3) పరీక్షా విధానం:

మొత్తం పరీక్ష 160 మార్కులకు ఉంటుంది. ప్రతీ ప్రశ్నకూ రెండు మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మాథ్స్, ఇంగ్లీష్ లేదా హిందీల నుంచి ప్రశ్నలుంటాయి. ఎగ్జామ్ వ్యవధి 60 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

4) దరఖాస్తు ఫీజు 100 రూ. మహిళలు, ఎస్సీ, ఎస్టీ , మాజీ సైనిక అభ్యర్థులు ఫీజు చెల్లించక్కర్లేదు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖ, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో పరీక్ష నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం SSC Official Website లో చూడొచ్చు.

Advertisement

Next Story