- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big Alert: భారీ జీతంతో రైల్వేలో ఉద్యోగాలు..రేపే లాస్ట్ డేట్
దిశ,వెబ్డెస్క్: రైల్వేశాఖ మరోసారి భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో 9,144 టెక్నీషియన్ పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీకి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్లో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 1092.. టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలు 8,052 వరకు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 21 ఆర్ఆర్బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అయితే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మార్చి 9 నుంచి ఏప్రిల్ 8వరకు కొనసాగనుంది. రేపటితో గడు వు ముగియనుండడంతో అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు https://indianrailways.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు. జూలై 1,2024 నాటికి వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫీజు :ఎస్సీ,ఎస్టీ, మహిళలు, ట్రాన్స్జెండర్,మైనారిటీ,ఈబీసీ అభ్యర్థులు 250 రూ ఫీజు చెల్లించాలి. ఇతరులు రూ.500 చొప్పున చెల్లించాలి.
ఎంపిక విధానం:రెండు పోస్టులకూ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ రాత పరీక్షతో పాటూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం:ఈ పోస్టులకు ఎంపికైతే టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.29000-92,300, గ్రేడ్-3 కి 19,900-రూ.62,200 పే స్కేల్ లభించనుంది.