BDL Recruitment: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులు .. డీటెయిల్స్ ఇవే..!

by Maddikunta Saikiran |
BDL Recruitment: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులు .. డీటెయిల్స్ ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) కంచన్ బాగ్(Kanchan Bagh)లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 150 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://bdl-india.in/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 25 నవంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

అప్రెంటిస్ - 150

విద్యార్హత:

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

11 నవంబర్ 2024 నాటికి 14-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

విద్యార్హతల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed