వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో 135 ఉద్యోగాలు.. భారీగా వేతనం, త్వరపడండి..

by Kavitha |   ( Updated:2022-03-30 08:03:30.0  )
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో 135 ఉద్యోగాలు.. భారీగా వేతనం, త్వరపడండి..
X

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ, మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్(MGM)లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 135

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 11

*ఇందులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 115, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 20 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఎండీ/ఎంఎస్/డీఎన్బీ పాసై ఉండాలి.

*సివిల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంబీబీఎస్ పాసై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి నెలకు రూ.52,000 నుంచి 1,25,000 వరకు వేతనంగా చెల్లిస్తారు.

*అకడమిక్ మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*ఆసక్తి గల అభ్యర్థులు పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*అడ్రస్: The Superintendent, Mahatma Gandhi Memorial Hospital, MG Road, Warnagal – 506007.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://kmcwgl.com/home వెబ్ సైట్ ను చూడొచ్చు.

Advertisement

Next Story

Most Viewed