న‌గ‌ర శివారులో భారీగా పట్టుబడ్డ గంజాయి… విలువెంతో తెలుసా..?

by Sumithra |
ganja seized
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: హైద‌రాబాద్ శివారులో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డ‌టం రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో క‌ల‌క‌లం రేపింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం పెద్ద అంబ‌ర్‌పేట చెక్‌పోస్టు వ‌ద్ద సుమారు రూ.20కోట్లు విలువ‌చేసే గంజాయి ప్యాకెట్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు.

ఏపీ నుంచి రోడ్డుమార్గంలో కోల్‌క‌తా, ముంబై, గుజ‌రాత్‌, ఢిల్లీ, బెంగ‌ళూరుకు స‌రుకును త‌ర‌లిస్తున్నట్లు గుర్తించారు. లారీల్లో జీడి ప‌ప్పు బ‌స్తాల చాటున గంజాయిని త‌ర‌లిస్తున్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో ఎన్సీబీ అధికారులు మాటువేసి నిందితుల‌ను ప‌ట్టుకున్నారు.

Advertisement

Next Story