ఆస్పత్రి క్యాంటీన్‌లో గంజాయి వంటకాలు

by Harish |
ఆస్పత్రి క్యాంటీన్‌లో గంజాయి వంటకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జిగ్లింగ్ బ్రెడ్, డ్యాన్సింగ్ సలాడ్…థాయ్‌లాండ్‌లోని ఓ హాస్పిటల్ క్యాంటీన్ మెనూలో ఈ వంటకాలు ఉన్నాయి. వీటిలో గంజాయి ఆకులు కలుపుతున్నారు. కాబట్టి వీటికి ఆ పేర్లు పెట్టారు. సాధారణ హోటల్‌లో వండుతున్నారనుకుంటే అంగీకరించవచ్చు. కానీ, హాస్పిటల్ క్యాంటీన్‌లో వండటం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే థాయ్‌లాండ్‌లో ఇటీవల గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేశారు. అయినప్పటికీ జనాలు దీని వాడకానికి అలవాటు పడటం లేదు. ఈ ఆకును తక్కువ మోతాదులో వంటల్లో వినియోగించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆ దేశం దీన్ని లీగలైజ్ చేసింది.

అందుకే జనాలకు అలవాటు చేయడానికి ప్రాచిన్ బురీ ప్రాంతంలో చావో ప్యా అభైభుబెజర్ హాస్పిటల్ క్యాంటీన్‌లో చేసే వంటల్లో గంజాయి ఆకును కొద్ది మోతాదులో కలుపుతున్నారు. ఇలా కలిపిన వంటకాలను పేషెంట్లు తినడం వల్ల వారు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుందని హాస్పిటల్ ప్రాజెక్ట్ లీడర్ పాకాక్రాంగ్ క్వాంకావో తెలిపారు. ఈ ఆకు వల్ల ఆకలి మెరుగుపడటమే కాకుండా ఎక్కువగా నిద్ర కూడా పడుతుందని, తద్వారా వ్యాధిగ్రస్తుడికి త్వరగా నయమవుతుందని ఆయన వివరించారు. గంజాయి ఆకు వల్ల ఉపయోగాలు ఉన్నాయని తెలిపిన హాస్పిటల్ ఇదే కావడం విశేషం.

Advertisement

Next Story