APSRTC: బస్సులో గంజాయి.. షాక్‌లో డ్రైవర్, కండక్టర్..!

by Sumithra |   ( Updated:2021-09-24 06:05:26.0  )
APSRTC: బస్సులో గంజాయి.. షాక్‌లో డ్రైవర్, కండక్టర్..!
X

దిశ, చిట్యాల: ఏపీఎస్ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల గంజాయిని శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కేతపల్లి టోల్‌గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే నర్సీపట్నం(ఏపీ) నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సులో 30 కేజీల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో ఇద్దరు మగ, ఓ ఆడ ఉన్నారు. సాధారణ ప్రయాణికుల మాదిరిగానే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నారని.. గంజాయి తరలిస్తున్నట్టు తమకు తెలియదని బస్సు డ్రైవర్, కండక్టర్ పోలీసులకు వివరణ ఇచ్చారు. అయితే, ఈ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ఎక్కడికి తరలిస్తున్నారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed