- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బిట్టు’ అని పిలిచినందుకేనా?
దిశ, వెబ్‌డెస్క్ : ‘బిగ్ బాస్ సీజన్ 4’ నుంచి జోర్దార్ సుజాత ఆదివారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సోమవారం రోజున పేపర్లు, యూట్యూబ్ చానళ్లు, వెబ్‌సైట్లు ఒకటే మాటను ప్రస్తావిస్తున్నాయి. సుజాత ఎందుకు ఎలిమినేట్ అయిందనేది ఆ కథనాల సారాంశం. అయితే వాటిలో ప్రత్యేకంగా చెప్పిన ఒక కారణం ఉంది. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఆమె ‘బిట్టు’ అని పిలవడం కూడా ఆమె ఎలిమినేషన్‌కు ఒక కారణమని కథనాలు పేర్కొన్నాయి. కొన్ని రివ్యూల్లో అయితే ఏకంగా అదే ప్రధాన కారణమని గట్టిగా చెప్పాయి. మరి బిగ్ బాస్ చూస్తున్న వాళ్లందరికీ అలాగే అనిపించిందా?
‘మనం’ సినిమాలో సమంత.. నాగార్జునను బిట్టు అని పిలుస్తుంది. పూర్వజన్మలో అమ్మగా చిన్నపుడు పెట్టిన పేరు అదే కాబట్టి, సమంత పాత్రకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి ఆ పేరును పలికే విధానానికి అందరూ ఫిదా అయ్యారు. బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్‌లో సుజాత ఎంట్రీ ఇచ్చినపుడు, నాగార్జునను బిట్టు అని పిలిచింది. అయితే ఆ ఒక్క ఎపిసోడ్‌కు బాగానే అనిపించింది. కానీ తర్వాత వీకెండ్ ఎపిసోడ్లలో కూడా నాగార్జున సీరియస్‌గా అడిగినపుడు సుజాత బిట్టు, బిట్టు అంటూ సమాధానం ఇవ్వడం గురించి చాలా మంది విమర్శించారు. సినిమాలో అయితే ఒక ఎఫెక్షన్, అనుబంధం ఉంటాయి కాబట్టి అలా పిలిచినా సబబుగా అనిపిస్తుంది. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకు సుజాత ఎవరనే విషయం అసలు నాగార్జునకు తెలుసో లేదో.. అలాంటిది ఆమె బిట్టు అనడం చాలా మందికి ఎబ్బెట్టుగా అనిపించింది. ఇదిలా ఉండగా, టాస్క్‌లలో పెద్దగా పార్టిసిపేట్ చేయకుండా వంటింటికే పరిమితం కావడం, ప్రతి చిన్న విషయాన్ని ఓవర్ థింక్ చేసి అలగడం, అవసరం ఉన్నా లేకపోయినా నవ్వడం.. వంటి కారణాలు కూడా సుజాత ఎలిమినేషన్‌కు దారి తీశాయని విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే వీళ్లందరి కంటే ముందుగా అనారోగ్య కారణాలరీత్యా ఇంటి నుంచి బయటకు వెళ్లిన గంగవ్వ కూడా సుజాత ఈ వారం వెళ్లిపోతుందని అనుకుంటున్నట్లు చెప్పడం కొసమెరుపు.