- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'అమ్మ మాట ఎప్పుడు విన్నామని?… అమ్మ ఎప్పుడో చెప్పింది'
‘అంతా సర్దుకుంటుంది.. గాభరా పడకు అంటూ అమ్మ చెప్పింది. అయినా అమ్మ చెప్పింది ఎప్పుడు విన్నామని?’ అంటూ ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా గతాన్ని గుర్తు చేస్తూ హితబోధ చేశాడు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సోనూ సూద్ ఏమన్నాడంటే…
“అంతా సర్దుకుంటుంది గాభరా పడకు. అంతా సర్దుకుంటుంది. చిన్నప్పుడు అమ్మ ఏం చెప్పిందో అదే చెబుతాను. చేతులు శుభ్రంగా కడుక్కో నీళ్లతో కాదు, సబ్బుతో శుభ్రంగా కడుక్కో.. ఆవారాగాడిలా ఎప్పుడూ ఎందుకు బయట తిరుగుతావు? ఇంట్లోనే ఉండొచ్చుగా..హాయ్ హలో ఏంటి? సలాం, నమస్తే చెప్పు.. సరిగ్గా తుమ్మడం, దగ్గడం కూడా రాదా? జేబులో రుమాలుంచుకో.. అమ్మ ఎన్నో విషయాలు నేర్పించాలని అనుకుంది. కానీ ఎవరు విన్నారు?
ఇవాళ ప్రపంచం చాలా ఇబ్బంది పడుతోంది. కరోనాతో పోరాడుతోంది. అమ్మ చెప్పిన విషయాలు ఎంత పెద్దవో ఇప్పుడే నాకు అర్ధమైంది. పాఠశాలలో పరీక్షలు జరుగుతున్నప్పుడు చాలా భయపడేవాడిని ఏం భయం లేదు.. అంతా సజావుగా సాగుతుంది అంటూ ధైర్యం చెప్పేది. ప్రపంచ పెను పరీక్షను ఎదుర్కొంటున్న వేళ అమ్మ మళ్లీ అదే చెబుతోంది. అంతా సజావుగా సాగుతుందని” అంటూ వీడియోను ముగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tags: mom talk, actor, sonu sood, corona virus, covid-19