- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జొమాటోకు షాక్.. రూ.11.82 కోట్ల ట్యాక్స్ నోటీసు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివీరీ కంపెనీ జొమాటోకు మరో షాక్ తగిలింది. రూ.11.82 కోట్లకు సంబంధించి డిమాండ్ నోటీసును అందుకుంది. జులై 2017 నుండి మార్చి 2021 వరకు భారతదేశం బయట ఉన్న దాని అనుబంధ సంస్థలకు అందించిన ఎగుమతి సేవలపై గురుగ్రామ్‌లోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అదనపు కమీషనర్ నుంచి నోటీసులను అందుకున్నట్లు కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తం రూ. 11.82 కోట్లలో రూ. 5,90,94,889 కోట్ల జీఎస్టీ, పెనాల్టీ కూడా రూ. 5,90,94,889 కోట్లుగా ఉంది.
ఈ షోకాజ్ నోటీసులకు స్పందించిన జొమాటో, సంబంధిత పత్రాలు, న్యాయపరమైన పూర్వాపరాలతో సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు అప్పీల్ దాఖలు చేస్తామని తెలిపింది. ఇటీవల కాలంలో దిగ్గజ ఫుడ్ డెలివరీ కంపెనీ వరుసగా జీఎస్టీ నోటీసులను అందుకుంటుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గుజరాత్‌లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ నుంచి రూ. 8.6 కోట్ల పెనాల్టీ నోటీసును అందుకుంది. గత కొంత కాలంగా కంపెనీ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కీలక మార్పులు చేస్తుంది. జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం 19.89 బిలియన్ డాలర్లుగా ఉంది.