- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Flight: విమానం ఎక్కితే వీపు విమానం మోతే.. బాంబు పేల్చిన ప్రభుత్వం

దిశ, వెబ్‌డెస్క్: Flight New Rules: ఫ్లైట్ జర్నీ అంత ఈజీ కాదు. అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి బ్యాగేజ్ పాలసీ. విమానయాన కంపెనీలు నిర్ధారించిన నియమ నిబంధనలు పాటించాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. ఈ విషయంలో ప్రతి సంస్థకు ప్రత్యేక రూల్స్ ఉంటాయి. అయితే ఇటీవల కొన్ని మార్పులు చేశారు. హ్యాండ్ లగేజీ పాలసీలో కొన్ని సవరణలు కూడా చేశారు. విమాన ప్రయాణాలు చేసేవారు దీని గురించి తెలుసుకవోడం చాలా ముఖ్యం. లేదంటే చెకిన్, సెక్యూరిటీ, బోర్డింగ్ దగ్గర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
హ్యాండ్ బ్యాగ్ పాలసీలో మార్పులు చేస్తూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక్కో ప్యాసింజర్ ఒక బ్యాగ్ ను మాత్రమే క్యారీ చేయాలని తెలిపింది. దేశీయ, విదేశీ ప్రయాణాలు రెండింటికి ఈ నిబంధనలు వరిస్తాయి. ఇతర బ్యాగ్ లు ఏమున్నా..కచ్చితంగా వాటిని ఎంట్రీ చేయించి సంబంధిత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఎయిరిండియా: ఎకానమీ, ప్రీమియం క్లాసుల్లో 7కిలోల వరకు హ్యాండ్ బ్యాగ్ ను అనుమతిస్తారు. బ్యాగ్ పొడవు, వెడల్పు, ఎత్తు 115 సెంటీమీటర్లు మించకూడదు. ఫస్ట్ లేదా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించేవారు మాత్రం రూ. 10కిలోల వరకు తీసుకెళ్లవచ్చు. వీటితోపాటు ల్యాప్ టాప్, లేడీస్ పర్స్ వంటి వస్తువులు తీసుకెళ్లవచ్చు. అయితే వాటి బరువు 3కిలోలు మించి ఉండకూడదు.
ఇండిగో: ఈ కంపెనీ వాళ్లు కూడా 7 కిలోల బరువు వరకు హ్యాండ్ బ్యాగ్ ను అనుమతిస్తున్నారు. ఇక్కడ కూడా సైజు విషయంలో 115 సెంటీమీటర్ల లిమిట్ వర్తిస్తుంది. మరోవైపు దేశీయంగా 15కిలోలు, ఇంటర్నేషనల్ అయితే డెస్టినేషన్ నుబట్టి20 నుంచి30కిలోల వరకు బ్యాగేజ్ ను చెక్ ఇన్ ద్వారా క్యారీ చేయవచ్చు. బరువు విషయంలో ఈ లిమిట్ దాటినట్లయితే హ్యాండ్ బ్యాగ్ పైనా ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. రోజు రోజుకు విమాన ప్రయాణాలు పెరిగిపోతున్నాయి. 2024 నవంబర్ లో రికార్డు స్థాయి ప్రయాణాలు నమోదు అయ్యాయి. దీంతో ఎయిర్ పోర్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా ప్యాసింజర్ చాలా సమయం లైన్లోనే ఉండాల్సి వస్తుంది. చెకిన్, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ వద్ద ఆలస్యం జరుగుతోంది. హ్యాండ్ బ్యాగేజీని తగ్గించగలిగితే సెక్యూరిటీ ప్రాసెస్ మరింత సులభం అవుతుంది. అందుకే ఈ మార్పులు చేశారు.
ఇక శానిటైజ్ చేసుకోకుండా ట్రేలను ముట్టుకోవడం, హ్యాండ్ రెస్ట్ లపై చేతులు పెట్టకూడదు. విమానం ఎక్కిన తర్వాత ముందు జాగ్రత్తగా ఓసారి సీటును శానిటైజ్ చేసుకోవాలి. మరోవైపు జర్నీలో ఉండగా స్వతహాగా పరిశుభ్రత పాటించాలి. స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ తిన్న తర్వాత ఆ చెత్తను జాగ్రత్తగా హోస్టెక్ ఇవ్వాలి. చుట్టుపక్కల, సీటు కింద చెత్తాచెదారం ఉంచకూడదు.
ఇంతకుముందు ప్రయాణించే క్లాస్ ను బట్టి 8 నుంచి 12కిలోల వరకు బరువు ఉండే హ్యాండ్ బ్యాగ్ లను అనుమతించేవారు. ఎకానమీ క్లాసులో 8కిలోలు, ప్రీమియం ఎకనామీలో 10కిలోలు, ఫస్ట్ లేదా బిజినెస్ క్లాస్ వాళ్లు 12కిలోల వరకు క్యారీ చేసే ఛాన్స్ ఉండేది. తాజాగా దీన్ని తగ్గించి ఈ లిమిట్ ను 7 నుంచి 10 కిలోల చేశారు. 2024 మే 2కు ముందే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రం పాత రూల్స్ వర్తిస్తాయి. వారంతా పాత నిబంధనల ప్రకారం హ్యాండ్ బ్యాగ్ ను తీసుకెళ్లవచ్చు. మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్ వంటి ప్రత్యేక బ్యాగేజీని తీసుకెళ్తే అదనంగా మరో సీట్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దాని బరువు 75కిలోలు మించి ఉండకూడదు.