గుడ్‌న్యూస్: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన యెస్ బ్యాంక్!

by Harish |   ( Updated:2023-05-02 14:20:15.0  )
గుడ్‌న్యూస్: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన యెస్ బ్యాంక్!
X

ముంబై: ప్రైవేట్ రంగ యెస్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తూ బ్యాంకు నిర్ణయం తీసుకోగా, కొత్త వడ్డీ రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. బ్యాంకు ఆధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, సాధారణ ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల లోపు డిపాజిట్లకు 3.25 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ రేట్లు వర్తించనున్నాయి.

సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం నుంచి 8.25 శాతం మధ్య వడ్డీ రాబడి లభిస్తుంది. అత్యధికంగా 18-36 నెలల మధ్య డిపాజిట్లకు యెస్ బ్యాంక్ సాధారణ ఖాతాదారులకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అదే కాలానికి సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం వడ్డీ ఇస్తోంది. అన్ని కాలవ్యవధులపై సాధారణ ఖాతాదారుల కంటే సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీని బ్యాంకు ఇస్తుంది.

Advertisement

Next Story