- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yatra-DW Travel: యాత్రా ఆన్‌లైన్ లిమిటెడ్- DW ట్రావెల్స్ మధ్య కుదిరిన భాగస్వామ్యం
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోనే అతిపెద్ద కార్పొరేట్ ట్రావెల్ సర్వీసెస్ ప్రొవైడర్, ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ అయిన యాత్రా ఆన్‌లైన్ లిమిటెడ్(YOL).. యూఏఈ(UAE)కి చెందిన ట్రావెల్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీడబ్ల్యూ(DW) ట్రావెల్‌తో కార్పొరేట్ ప్లాట్‌ఫారమ్ పార్టనర్ (CPP) ప్రోగ్రామ్ కింద కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీలకు కొత్త ఆదాయ మార్గాలు, అధునాతన ప్రయాణ ఫీచర్‌లతో సేవలను అందించడానికి DW ట్రావెల్స్ తో జతకట్టినట్లు యాత్రా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా DW ట్రావెల్ 2004లో దుబాయ్(Dubai)లో స్థాపించబడింది. ఇది వీఐపీ(VIP)&లగ్జరీ(Luxury) ట్రావెల్‌లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ కార్పొరేట్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ కంపెనీ. ఇక యాత్రా ఆన్‌లైన్ లిమిటెడ్ మన దేశంలో ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థల్లో ఒకటి. ఈ కంపెనీకి ఇండియాలో 850కి పైగా కార్పొరేట్ వినియోగరులు(Corporate Customers) ఉన్నారు. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా దాదాపు 1,500 పట్టణాల్లోని 1.08 లక్షల హోటళ్లతో ఒప్పందం ఉంది. ఈ కంపెనీ హోటల్ బుకింగ్స్, బస్సులు, ట్రైన్స్, క్రూయిజ్ షిప్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కు సంబంధించి బుకింగ్ సేవలను అందిస్తోంది.