వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 22 లక్షల కోట్లకు సేవల ఎగుమతులు!

by Disha Newspaper Desk |
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 22 లక్షల కోట్లకు సేవల ఎగుమతులు!
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత సేవల ఎగుమతులు 300 బిలియన్ డాలర్ల(రూ. 22.32 లక్షల కోట్ల) లక్ష్యాన్ని కలిగి ఉన్నామని సేవల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్(ఎస్ ఈపీసీ) తెలిపింది. రానున్న రోజుల్లో సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలు, ఇతర కార్యకలాపాలు పునః ప్రారంభమవుతాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సేవల ఎగుమతులు రూ. 17.8 లక్షల కోట్లకు చేరుకుంటాయని ఎస్ ఈపీసీ చైర్మన్ సునీల్ హెచ్ తలతి చెప్పారు. ఈ క్రమంలో సేవల ఎగుమతి రంగానికి రానున్న బడ్జెట్‌లో అవసరమైన సహాయక చర్యలు ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.

ఈ రంగానికి దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధి సాధించడానికి సామర్థ్యాన్ని పెంచే నిర్దిష్ట పథకాలు అవసరమని, ఇందుకోసం పీఎల్ఐ పథకాన్ని అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల విద్య, విమానయాన, హెల్త్‌కేర్, ఆర్అండ్‌డీ, సినీ నిర్మాణ రంగాలకు ఎంతో దోహదపడుతుందని వివరించారు. సేవల ఎగుమతులు పెంచేందుకు ఎస్ఈఐఎస్(భారత్ నుంచి సేవల ఎగుమతి) పథకానికి ప్రత్యామ్నాయంగా డ్రెస్(సేవల ఎగుమతులపై డ్యూటీ రెమిషన్)ని అమలు చేయాలని సునీల్ ప్రతిపాదించారు.

Advertisement

Next Story

Most Viewed