- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wealthiest Family: ప్రపంచ అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో అంబానీ ఫ్యామిలీ
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబం టాప్-10లో చోటు దక్కించుకుంది. 99.6 బిలియన్ డాలర్ల(రూ. 8.45 లక్షల కోట్ల)తో అంబానీ ఫ్యామిలీ ఈ జాబితాలో స్థానం సంపాదించింది. ప్రముఖ బ్లూమ్‌బర్గ్ తాజా 2024 ఏడాదికి చెందిన ర్యాంకుల జాబితా ప్రకారం, వాల్‌మార్ట్‌కు చెందిన వాల్టన్ ఫ్యామిలీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో వాల్‌మార్ట్ షేర్ల ర్యాలీ కారణంగా వాల్టన్ ఫ్యామిలీ సంపద 80 శాతం పెరిగి 432.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో వీరి కుటుంబం మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వాల్టన్ ఫ్యామిలీ ఈ ఏడాదిలో ప్రతి నిమిషానికి దాదాపు రూ. 3 కోట్లు సంపదించినట్టు బ్లూమ్‌బర్గ్ లెక్కలు చెబుతున్నాయి. రిటైల్ వ్యాపారంలో సామ్రాజ్యాన్ని స్థాపించిన వాల్టన్ ఫ్యామిలీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా వాల్‌మార్ట్ స్టోర్లను నిర్వహిస్తోంది. వీరి తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి చెందిన రాజ కుటుంబం అల్ నహ్యాన్ కుటుంబం 323.9 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. మూడోస్థానంలో ఖతార్జ్ రాజ కుటుంబం అల్ థానీ ఫ్యామిలీ 172.9 బిలియన్ డాలర్లను కలిగి ఉంది. వీరికి విస్తారణమైన చమురు నిల్వలు, గ్యాస్ ఫీల్డ్‌లు ఉన్నాయి. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్స్ నిర్వహణ సంస్థ హీర్మేస్ ఫ్యామిలీ 170.6 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో, అమెరికాకు చెందిన చమురు వ్యాపార కుటుంబం కోచ్ ఫ్యామిలీ 148.5 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.
జాబితాలో భారతీయ కుటుంబాలు..
అంబానీ కుటుంబం: 99.6 బిలియన్ డాలర్ల సంపదతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంబానీ కుటుంబం మూడు తరాలుగా వ్యాపార రంగంలో ఉంది. ఈ సంవత్సరం టాప్ 10లోకి ప్రవేశించింది.
మిస్త్రీ కుటుంబం: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ను పర్యవేక్షించే ఐదు తరాల మిస్త్రీ కుటుంబం 41.4 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో 23వ స్థానాన్ని పొందింది.