- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది ఏసీ అమ్మకాల్లో 20 శాతం వృద్ధి!
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అధిక డిమాండ్ వంటి పరిస్థితుల మధ్య ఈ ఏడాది వేసవిలో రిటైల్ ఎయిర్ కండీషనర్‌ల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధిస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సీజన్‌కు ముందే గిరాకీ పెరగడం, ఏసీ తయారీ కంపెనీలు మరింత సమర్థవంతమైన ఇన్వర్టర్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏసీల అమ్మకాలు 15-20 శాతం అమ్మకాల వృద్ధి ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపాయి. ఈ తరుణంలోనే తయారీ బ్రాండ్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ఏసీలతో పాటు రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌కూలర్ వంటి చలువ ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు తయారీ కంపెనీలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఉన్నాయి. దీనివల్ల ఈ వేసవిలో మరింత వేడి వాతావరణం కారణంగా ఏసీలకు అధిక గిరాకీ ఉండనుందని టాటా గ్రూపునకు చెందిన వోల్టాస్ తెలిపింది. ఇప్పటికే ఏసీలతో పాటు ఎయిర్‌కూలర్, రిఫ్రిజిరేటర్ల కొనుగోలు కోసం వినియోగదారుల నుంచి ఎంక్వైరీలు పెరిగాయని వోల్టాస్ ఎండీ, సీఈఓ ప్రదీప్ బక్షి అన్నారు. పరిశ్రమల సంఘం కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యూఫాక్చరర్స్ అసోసియేషన్(సీఈఏఎంఏ) సైతం ఈ ఏడాది ఏసీ అమ్మకాల్ 20 శాతం పెరుగుతాయని అంచనా వేసింది. 2022లో భారత రిటైల్ ఏసీ మార్కెట్ సుమారు 82.5 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయని సీఈఏఎంఏ అధ్యక్షుడు ఎరిక్ పేర్కొన్నారు.