Vodafone Idea: కస్టమర్లకు వొడాఫోన్ ఐడియా గుడ్ న్యూస్.. ఇక నుంచి స్పీడ్ నెట్ వర్క్..!

by Maddikunta Saikiran |
Vodafone Idea: కస్టమర్లకు వొడాఫోన్ ఐడియా గుడ్ న్యూస్.. ఇక నుంచి స్పీడ్ నెట్ వర్క్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా(Vodafone Idea) గత కొంత కాలంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్(September)తో ముగిసిన రెండో త్రైమాసికంలో(Second Quarter) సంస్థ రూ. 7,176 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఇతర టెలికాం సంస్థల కంటే రీఛార్జి ప్లాన్ రేట్లు ఎక్కువ ఉండటం, అలాగే వేగవంతమైన డేటా లేకపోవడంతో చాలా మంది వొడాఫోన్ ఐడియాను వదిలి ఇతర నెట్ వర్క్ కంపెనీలకు పోర్ట్ అయితున్నారు.

ఈ నేపథ్యంలో తన యూజర్లకు వొడాఫోన్ ఐడియా గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(TG) రాష్ట్రాల్లోని 20కి పైగా జిల్లాల్లో నెట్ వర్క్ స్పీడ్(Network speed)ను మెరుగుపరిచినట్లు తెలిపింది. 900 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్(Megahertz spectrum)తో సుమారు 3,450కి పైగా సెల్ టవర్ల(Cell Towers)ను అప్ గ్రేడ్ చేసినట్లు పేర్కొంది. దీంతో కస్టమర్లకు వేగవంతమైన నెట్ వర్క్ లభిస్తుందని తెలిపింది. అలాగే రూ. 691 కోట్లతో 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్ లో 2.4 మెగాహెర్ట్జ్ కొనుగోలు చేశామని, 5,000కు పైగా సైట్స్ లో డేటా స్పీడ్ ను రెట్టింపు చేయడానికి స్పెక్ట్రమ్ ను 10 మెగాహెర్ట్జ్ నుంచి 20 మెగాహెర్ట్జ్ కు అప్ గ్రేడ్ చేసినట్లు పేర్కొంది.

Advertisement
Next Story

Most Viewed