అన్అకాడెమీ కీలక నిర్ణయం.. ఆఖరికి వారికి కూడా తప్పేలా లేదు!

by Harish |
అన్అకాడెమీ కీలక నిర్ణయం.. ఆఖరికి వారికి కూడా తప్పేలా లేదు!
X

బెంగళూరు: వరుసగా ఉద్యోగులను తొలగింపులను ప్రకటించిన ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ అన్అకాడెమీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతికూల పరిస్థితుల మధ్య ఖర్చులను తగ్గించడంతో పాటు లాభదాయకతను పెంచేందుకు కంపెనీ వ్యవస్థాపకులతో పాటు లీడర్‌షిప్ టీమ్‌లోని అందరి జీతాల్లో శాశ్వత కోత విధించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ గౌరవ్ ముంజల్ ఓ ప్రకటనలో తెలిపారు.

వ్యవస్థాపకులతో పాటు అన్అకాడెమీ లీడర్‌షిప్ టీమ్‌లో అందరి జీతాల్లో శాశ్వతంగా కోత ఉంటుంది. ఎంత వరకు కోత అనేది వారి జీతం, పనితీరు, సంస్థలో ఉద్యోగ స్థాయిని బట్టి ఉంటుంది. 25 శాతం వరకు జీతాల్లో కోత విధించాలని భావిస్తున్నాం. తిరిగి 2024, ఏప్రిల్‌లో మాత్రమే వారి వేతనాల్లో సవరణ ఉంటుందని గౌరవ్ ముంజాల్ ఉద్యోగులకు తెలిపారు.

గురువారం అన్అకాడెమీ సంస్థ తదుపరి లేఆఫ్స్‌లో భాగంగా 12 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ ఎదుర్కొంటున్న ప్రతికూలత మధ్య భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని గౌరవ్ ఉద్యోగులకు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed